హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్మీ జవాన్‌కు ఘన సన్మానం

BHPL: తిరుమలాపురం గ్రామానికి చెందిన గోలకొండ రాజకుమార్ శ్రీనగర్‌లో ఆర్మీ హవల్దారుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితం విధి నిర్వహణలో కొండచరియలు విరిగిపడి గాయపడిన ఆయన చికిత్స అనంతరం గ్రామానికి చేరుకున్నారు. సర్పంచ్ జన్నె సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాజకుమార్‌ను సన్మానించి, త్వరగా కోలుకుని తిరిగి దేశ రక్షణలో సేవలందించాలని ఆకాంక్షించారు.