హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి'

BHNG: హోమియోపతి, యునానీ, నేచురోపతి వైద్యులకు ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డా. చినుకని శివప్రసాద్ కోరారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయుష్ వైద్యుల సమస్యలను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.