హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల సమస్యపై గ్రామసభ

బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో బాలల హక్కుల పరిరక్షణపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిలుముల సతీష్ మాట్లాడుతూ.. పిల్లల హక్కుల పరిరక్షణతో పాటు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారుల సమస్యల పరిష్కారానికి గ్రామసభలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.