WGL: 100 ఫీట్ల రోడ్డులో గల గ్రీన్ సిటీ కాలనీలో ఆగంతకుల సంచారం కలకలం రేపుతోంది. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత హెల్మెట్లు ధరించి ఒంటరిగా ఉంటున్న మహిళల ఇళ్లకు వెళ్లి కాలింగ్ బెల్స్ మోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ అప్రమత్తంగా వ్యవహరించి తలుపు తీయకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: హెల్మెట్లు ధరించి ఇళ్ల వద్దకు ఆగంతకులు


