హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాకపోకలు సాగేదెలా!

JN: పాలకుర్తి పట్టణం నుంచి మార్కెట్ మీదుగా తీగారం వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గతంలో కొంతమేర రోడ్డు చదును చేసి కంకర పోసి అసంపూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం కంకరతో పాటు రహదారికి ఇరువైపులా ముళ్ళ చెట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.