హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయాలు విజ్ఞాన అభివృద్ధికి కేంద్రాలు

SRCL: గ్రంథాలయాలు విజ్ఞాన అభివృద్ధికి కేంద్రాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. తొలుత జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటంతో పాటు గ్రంథాలయ ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.