హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత టీబీ ముక్త్ అభియాన్ శిభిరం

ADB: నార్నూర్ మండలంలోని సుంగాపూర్ గ్రామంలో శనివారం 'టీబీ ముక్త్ జనజాతి అభియాన్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామస్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేశారు. క్షయవ్యాధి(టీబీ) లక్షణాలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్సపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ పెందోర్ లక్ష్మణ్, కార్యదర్శి దీప్ చంద్, ప్రవీణ్, సార్ధవర్ధన్ ఉన్నారు.