హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెహ్రూకు కాంగ్రెస్ నాయకులు నివాళులు

WGL: నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి నెహ్రూ సేవలు చరిత్రలో చిరస్థాయిగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాలోత్ చరణ్ సింగ్, జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, PACS ఛైర్మన్ రఘుపతిరావు, నాయకులు, పాల్గొన్నారు.