హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

NZB: భీమగల్లోని ప్రసిద్ధ నింభాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక శనివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు కాలినడకన కొండపైకి చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.