హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నోజిగూడలో 3,400 గజాల స్థలం రక్షణ

MDCL: ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలో సర్వే నంబర్లు 94, 95లోని 3,400 గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా శుక్రవారం పరిరక్షించింది. రికార్డుల ప్రకారం ఇందులో పార్కుకు 1,122, పాఠశాలకు 1,018, కమ్యూనిటీ హాల్‌కు 742, ఆలయానికి 518 గజాలు కేటాయించారు. ఆక్రమణలు తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.