హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెంజల్లో భారీ దొంగతనం

NZB: రెంజల్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. గ్రామానికి చెందినఆకుల మోహన్ కుటుంబీకులతో కలిసి బయటకు వెళ్లి శనివారం ఉదయం ఇంటికి వచ్చే సరికి తలుపులుపగలగొట్టి ఉండటాన్ని గమనించారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రెంజల్ ఎస్ఐ గంగాధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.22 తులాల బంగారం,రూ.20 వేల నగదు చోరీ జరిగినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు.