NZB: భీమగల్లోని ప్రసిద్ధ నింభాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కార్తీక శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పలువురు కాలినడకన కొండపైకి చేరుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగగా, భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.
తెలంగాణ
VIDEO: కార్తీక శనివారం.. నింభాచలానికి భక్తుల తాకిడి


