BHNG: చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న గండికోట సత్తమ్మ, గండికోట రాజు, పిసాటి లక్ష్మమ్మ ఇళ్లలోకి చొరబడి బీరువాల్లోని నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
దొంగల బీభత్సం మూడు ఇళ్లలో చోరీ


