హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ కార్యాలయం చెంతనే విద్యుత్ ఉచ్చులు

MLG: ఏటూరునాగారం అటవీశాఖ కార్యాలయానికి సమీపంలోనే వేటగాళ్లు విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. ప్రధాన రహదారి కల్వర్టు నుంచి అటవీ మార్గంలో ఐదు కిలోమీటర్ల మేర తీగలు లాగి ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కనే అటవీశాఖ నర్సరీ, అధికారులు ఉన్నా ఉచ్చులు ఏర్పాటు కావడంపై శాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.