హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంతెన ఇరువైపులా రక్షణ గోడలు లేక ప్రమాదం

ADB: ఇచ్చోడ మండల కేంద్రం నుంచి జామిడి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న ఈ వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం ఏమర పాటుగా ఉన్నా.. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. నిత్యం ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలురాకపోకలు సాగిస్తుంటాయి.