WNP: దుప్పల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన నల్లబోతుల అంజి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా బియ్యం లభ్యమైంది. పౌరసరఫరాల అధికారులు బియ్యాన్ని పరిశీలించి రేషన్ బియ్యంగా నిర్ధారించారు. అనంతరం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆత్మకూరు గోదాంకు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ
11 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


