హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ ఎత్తివేసిన DEO

BDK: ఇల్లెందు మండలం మర్రిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ డీఈవో శంభుప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విధులు, నిర్వహణలో లోపాలు అధికారుల అనుమతి లేకుండా బీఈడీ పరీక్షకు హాజరైన ఆరోపణలతో ఈ నెల 5న ఆయనను సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయుడు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన డీఈవో తిరిగి సంజయ్‌నగర్ పాఠశాలకు బదిలీ చేశారు.