హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనంలో పరిమితికి మించి విద్యార్థుల తరలింపు

ASF: పెంచికల్ పేట్ మండల కేంద్రంలోని కిరణ్ మోడల్ E/M స్కూల్ యాజమాన్యం విద్యార్థుల భద్రతను గాలికి వదిలేసింది. పాఠశాలకు చెందిన విద్యార్థులను టాటా మ్యాజిక్ వాహనంలో పరిమితికి మించి ప్రమాదకరంగా తరలిస్తున్నారు. వాహనం వెనుక రక్షణ లేకుండా విద్యార్థులు ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు.