హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిన మరుగుదొడ్లు

నిర్మల్ జిల్లా కుభీరు మండలంలోని సాంగ్వీ పాఠశాలలో ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆ బడిలో చదువుకునే భావితరం ఒంటికి, రెంటికి ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అసంపూర్తిగా నిలిచిపోయిన మరుగుదొడ్లను పూర్తి చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.