హైదరాబాద్: 28°C
వ్యాపారం

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడికి కోడిగుడ్డు ధర షాక్ ఇస్తోంది. గతంలో హోల్‌సేల్ మార్కెట్లో డజన్ గుడ్ల ధర రూ.80 ఉండగా.. ప్రస్తుతం రూ.96కు చేరుకుంది. స్వల్ప వ్యవధిలోనే డజన్‌పై రూ.16 మేర ధర పెరిగింది. చిల్లర దుకాణాల్లో రూ.6 నుంచి రూ.7 మధ్య పలికిన ఒక్కో కోడిగుడ్డు ధర, ప్రస్తుతం రూ.7.50 నుంచి రూ.8 వరకు పలుకుతోంది. హైదరాబాద్‌లో 100 గుడ్ల ధర రూ.640 ఉండగా, విశాఖలో రూ.625 వద్ద నమోదైంది.