మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ బ్రేక్‌డౌన్‌పై మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా ఆసక్తికరంగా స్పందించారు. 'దీనివల్ల నేనెంతగా మెయిల్స్‌పై ఆధారపడ్డానో అర్థమైంది. నెట్ ప్రాబ్లం అనుకోవడం, ఆందోళన, నిస్సహాయత తర్వాత.. ఎవరికీ రిప్లై ఇవ్వక్కర్లేదనే స్వేచ్ఛను ఆస్వాదించా. తీరా అవుట్‌లుక్ వచ్చాక.. ఒక దీవిలో ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్న నన్ను ఎవరో రక్షించినట్లు ఫీలయ్యా. సేవలు రావడం బాధేసింది' అని చమత్కరించారు.
వ్యాపారం
మైక్రోసాఫ్ట్ ఔటేజ్‌పై ఆనంద్ మహీంద్రా ఫన్నీ పోస్ట్


