హైదరాబాద్: 28°C
వ్యాపారం

చిప్స్ ధరతో పోలిస్తే రీఛార్జ్ ధర తక్కువ: మిత్తల్

మొబైల్ రీఛార్జ్ ధరలపై భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక బాటిల్ పెప్సీ లేకపోతే ఒక ప్యాకెట్ చిప్స్ ధరతో పోలిస్తే రీఛార్జ్ ధర చాలా తక్కువేనని తెలిపారు. వినియోగదారులు తమకు లభిస్తున్న సేవలకు తగినట్లుగా ఎక్కువ చెల్లించాలని వ్యాఖ్యానించారు. విద్యుత్, ఇంధనం, జీతాలు, ఇతర పరిపాలనా ఖర్చులు పెరిగాయని.. దీంతో నెట్ వర్క్ నిర్వహణ కష్టమవుతోందన్నారు.