హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయి, క్యూలైన్లు నారాయణగిరి షెడ్ల వరకు చేరాయి. నిన్న స్వామివారిని 73,392 మంది భక్తులు దర్శించుకోగా.. 33,288 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.90 కోట్లుగా నమోదైందని టీటీడీ తెలిపింది.