హైదరాబాద్: 28°C
భక్తి

కార్తీకమాసం.. సోమవారాలకు విశేష ప్రాధాన్యత

కార్తీక మాసంలోని సోమవారాలకు విశేష ప్రాధాన్యత ఉంది. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు ఉపవాసం ఉండి శివాలయాలను దర్శిస్తారు. శివలింగానికి పంచామృతాభిషేకం, బిల్వదళార్చన నిర్వహించి శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. కార్తీక సోమవార వ్రత కథలను వినడం ద్వారా ఆధ్యాత్మిక సందేశాన్ని తెలుసుకుంటారు. ఈ మాసంలో అన్నదానం, వస్త్రదానం, గోసేవ, పేదలకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.