AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకు భక్తుల క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,085 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి రూ.3.93 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
భక్తి
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ


