హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో స్మార్ట్‌ బస్టాప్‌ల నిర్మాణం

AP: తిరుమలలో ఉచిత ధర్మరథం బస్సుల కోసం రేమండ్స్ సంస్థ సహకారంతో 21 చోట్ల స్మార్ట్ బస్టాప్‌లను నిర్మించనున్నారు. తొలి దశలో రాంభగీచా, లేపాక్షి సహా 3 బస్టాప్‌లను పెద్దవిగా తీర్చిదిద్దనున్నారు. ఎండ, వర్షాల నుంచి భక్తులకు ఉపశమనం కలగనుంది. ప్రతిచోటా 'వెంకటాద్రి యాప్' QR కోడ్ ఏర్పాటు చేయనుండగా, దీన్ని స్కాన్ చేసి బస్సు రూట్ మ్యాప్, వచ్చే సమయం తదితర వివరాలు తెలుసుకోవచ్చు.