హైదరాబాద్: 28°C
వ్యాపారం

పండగ పూట కల్లేపల్లిలో విషాద ఘటన

SDPT: కుమారుడి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి మృతి చెందడంతో బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గడ్డం మధు (42) పెద్ద కుమారుడు శివ సాత్విక్ (13) ఈ నెల 7న అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక మధు కూడా కన్నుమూశాడు. భార్య కవిత ఆశా కార్యకర్తగా పనిచేస్తుండగా, తొమ్మిదేళ్ల కుమారుడు రేవంత్ ఉన్నాడు.