హైదరాబాద్: 28°C
క్రీడలు

భువీని ఊరిస్తున్న అరుదైన రికార్డు

నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్‌ను కివీస్ పర్యటనలో అరుదైన రికార్డు ఊరిస్తోంది. భారత్ తరఫున 87 టీ20లు ఆడిన భువీ.. 90 వికెట్లు పడగొట్టాడు. ఈ పర్యటనలో అతడు మరో 10 వికెట్లు తీస్తే, అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల క్లబ్‌లో చేరుతాడు. ఇప్పటివరకు భారత్ తరఫున టీ20ల్లో అర్ష్‌దీప్(145), బుమ్రా(126), పాండ్యా(114), అక్షర్(113) మాత్రమే ఈ ఫిట్ సాధించారు.