హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

VSP: భీమిలి నియోజకవర్గంలోని 9 మంది టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు ఎంవీపీ కాలనీ క్యాంప్ ఆఫీసులో ఈరోజు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీ-ఫారాలు అందజేసి అభినందనలు తెలిపారు. కూటమి శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆశీస్సులు పొందాలని సూచించారు. అన్ని వార్డుల్లోనూ కూటమి అభ్యర్థుల ఏకపక్ష విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని తెలియజేశారు.