హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమర పోలీసుల సేవలు అమూల్యం: ఎస్పీ

CTR: జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమర పోలీసుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, శాంతిభద్రతల పరిరక్షణలో వారి సేవలు అమూల్యమని అన్నారు.