E.G: నల్లజర్లలో ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు CI రవికుమార్ తెలిపారు. నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధి దాటి ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థితో కలిపి ముగ్గురిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థితో పాటు ముగ్గురికే అనుమతి: సీఐ


