హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది'

NTR: సుప్రీంకోర్టు ఆదేశాలను YCP వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని TDP విమర్శించింది. 19 చోట్ల నామినేషన్ల గడువు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించలేదని పేర్కొంది. ఫిర్యాదులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘానికే అప్పగించిందని తెలిపింది. నామినేషన్లు, ఎన్నికల నిర్వహణపై కోర్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది.