హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయోడిన్ లోపనివారణపై అవగాహన

BPT: ప్రపంచ అయోడిన్ లోపనివారణ దినోత్సవం సందర్భంగా ఉప్పుటూరులో హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ అవగాహన సదస్సు నిర్వహించారు. శరీర ఎదుగుదల, థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అయోడిన్ కీలకమని తెలిపారు. లోపిస్తే గాయిటర్, పిల్లల్లో మందబుద్ధి, గర్భిణులలో వైకల్యంతో కూడిన ప్రసవాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. సాధారణ ఉప్పుకు బదులుగా ప్యాకెట్ అయోడైజ్డ్ ఉప్పునే వాడాలని సూచించారు.