హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 10 కుటుంబాలు

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి స్వామి కార్యాలయంలో బుధవారం పొన్నలూరు మండలానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారిని మంత్రి స్వామి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీలోకి వస్తున్నారని మంత్రి స్వామి అన్నారు.