హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మార్చాలని వినతి

KKD: సామర్లకోట శివారు మాజేటి నగర్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పట్టణ కేంద్రానికి మార్చాలని బహుజన దర్బార్ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం సబ్‌ రిజిస్ట్రార్ బి.వి.వి. సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. రవాణా సదుపాయాలు లేక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.