హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూడో పోటీల్లో సత్తా చాటిన చాగల్లు విద్యార్థి

E.G: రాష్ట్రస్థాయి అండర్-19 జూడో పోటీల్లో చాగల్లు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బి. చంద్రరావు కాంస్య పతకం సాధించాడు. తిరుపతిలో ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగిన పోటీల్లో అతడు రాణించినట్లు పీడీ విజయలక్ష్మి తెలిపారు. గ్రామం నుంచి తొలిసారిగా ఈ ఘనత సాధించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. విజేతను పాఠశాల HM వాసవి, ఉపాధ్యాయులు అభినందించారు.