హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్రమ అరెస్టులతో అభ్యర్థులను భయపెడుతున్నారు'

NDL: బనగానపల్లెలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నాయకులతో కలిసి బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఓటమి భయంతోనే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.