హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో ZPTC, MPTC నామినేషన్లు షురు

కృష్ణా: జిల్లాలో ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. జిల్లాలో 26 ZPTC, 358 MPTC స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ కార్యాలయంలోని నామినేషన్ల కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.