హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్ద చెర్లపల్లిలో నామినేషన్‌ సందర్భంగా ఉద్రిక్తత

ప్రకాశం: పెద్ద చెర్లపల్లిలో ఎంపీపీ అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థి పోలు వరలక్ష్మి నామినేషన్‌ వేయడానికి వస్తుండగా టీడీపీ నాయకులు నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించివేసినట్లు వైసీపీ వర్గాలు ఆరోపించాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సద్ది చెప్పారు.