SKLM: మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టీడీపీకి రాజీనామా చేశారు. శ్రీకాకుళం అరసవల్లిలోని స్వగృహంలో బుధవారం విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమవుతూ రాజీనామా లేఖ విడుదల చేశారు. 40 ఏళ్లుగా పార్టీ జెండా మోశామని, తనను, అనుచరులను అడుగడుగునా అవమానాలకు గురిచేశారని, ఆత్మగౌరవం కోసమే, తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయడానికే వీడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే


