హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి మాజీ MLAకు నోటీసులు

TPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీకాళహస్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిబంధనలను పాటించాలన్నారు.