హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడ్చల్ వీధుల్లో దుర్గామాత ఊరేగింపు

MDCL: పట్టణంలోని గడి మైసమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపు పట్టణ ప్రధాన వీధుల గుండా భక్తిశ్రద్ధలతో సాగింది. మాలధారణ చేసిన భక్తులు భజనలు ఆలపిస్తూ, డీజే పాటల నడుమ ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపుతో పట్టణంలో పండుగ సందడి నెలకొంది.