హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

ATP: రాప్తాడులోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసి నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్, ఎన్నికల అధికారి ఓ. ఆనంద్ పరిశీలించారు. నోటీస్ బోర్డులు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లను ఆరా తీశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.