హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు

PDPL: పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా మంథని పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మంథనిలో బుధవారం అమరవీరుల స్మారక స్థూపం వద్ద పూలు సమర్పించి, సెల్యూట్‌తో వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. మంథని పీఎస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.