హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి'

కృష్ణా: మచిలీపట్నం పరేడ్ మైదానం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా, విధులు నిర్వర్తించిన వారి సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ పాల్గొన్నారు.