హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: కాటసాని

NDL: పాణ్యం మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలతో నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.