హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగాయలంకలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

కృష్ణా: నాగాయలంకలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి సిహెచ్. వీరాంజనేయ ప్రసాద్ నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. మండల పరిధిలోని బావదేవరపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన నుంచి మండలి స్వర్ణ తమ నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి సమర్పించారు. ఎంపీడీవో కేఎం చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ మండలి ఉదయభాస్కర్ పాల్గొన్నారు.