ELR: బుట్టాయిగూడెం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని ఎస్సై చెన్నారావు తెలిపారు. అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్సై


