హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో జనసేన బోణి

W.G: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. 20వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారంపూడి సుమంత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థి జిల్లా పెద్దిరాజు తన రాజీనామాను ఉపసంహరించుకోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో 28 వార్డుల ఎన్నికల ప్రక్రియలో జనసేనకు తొలి విజయం దక్కినట్లయింది.