అన్నమయ్య: మదనపల్లెలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అనంతరం ర్యాలీ నిర్వహించి, మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు నగదు బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం


